గుంటూరు జిల్లాలో..
నరసరావుపేట మండలం శాంతి నగర్ వద్ద ఆటోను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులిద్దరూ నకరికల్లు మండలం మాచవరం గ్రామానికి చెందిన మసులూరి కనకయ్య, తంగేళ్ల శివకృష్ణగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖ జిల్లాలో..
నాతవరం వద్ద కారు చెట్టు ఢీ కొట్టిన ఘటనలో అన్నాదమ్ములిద్దరూ మృతి చెందగా... డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. నాతవరం గ్రామానికి చెందిన ఆశపు వాసుకు.. ఇటీవలే విశాఖలో ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. అక్కడ పని చేయాలంటే, కారు డ్రైవింగ్ వచ్చి ఉండాలనటంతో.. డ్రైవింగ్ నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే గ్రామానికి చెందిన అంకంరెడ్డి వంశీ డ్రైవింగ్ నేర్పించేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆసపు వాసు, సాయిలు కారులో బయలుదేరారు. అగ్రహారం వద్ద చెట్టును ఢీకొట్టారు. సంఘటనా స్థలంలోనే అన్నాదమ్ములిద్దరూ మృతి చెందగా.. డ్రైవర్ వంశీకి తీవ్ర గాయాలవటంతో పరిస్థితి విషమంగా ఉంది.
తూర్పు గోదావరి జిల్లాలో..
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన తిరుమల శెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి.. పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: