గుంటూరు జిల్లా వినుకొండలో మండలంలోని చీకటిపాలెంలో ద్విచక్రవాహనాన్ని.. బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పుకొండ గ్రామానికి చెందిన మర్రి వెంకట రామయ్య, మర్రి వెంకటరమణ, మౌనిక అనే చిన్నారి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వినుకొండ నుంచి శ్రీ శైలం వెళ్తున్నా నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరమణయ్యకు కాళ్లు విరిగాయి. స్థానికుల సహాయంతో క్షత్రగాత్రులను అంబులెన్స్‌లో వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ తరలించాలని వైద్యులు సూచించారు.
ఇదీ చదవండి: