గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలంలోని జంగంగుంట్ల పాలెం వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. అటుగా వస్తున్న ఆటో ద్విచక్రవాహనాన్ని తప్పించిబోయి పక్కన ఉన్న లంకలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిని ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మెడికొండ్రు పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి గుంటూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు కఠినం