ETV Bharat / state

డివైడర్​ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు... నలుగురికి గాయాలు

అయ్యప్ప భక్తులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయలయ్యాయి. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో తెల్లవారుజామున జరిగింది

డివైడర్​ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు
author img

By

Published : Nov 19, 2019, 9:38 AM IST

డివైడర్​ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు... నలుగురికి గాయాలు

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్పస్వామి భక్తులతో రాజమహేంద్రవరం నుంచి శబరిమలకు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు డివైడర్​ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను గుంటూరు జీజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురానికి చెందిన 11 మంది, కోరుకొండ మండలానికి చెందిన 12 మంది, జంగారెడ్డిగూడెంకు చెందిన పది మంది ఉన్నారు. బస్సు డ్రైవర్​ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

పెరుమలపల్లి వద్ద అదుపు తప్పిన కర్ణాటక ఆర్టీసీ బస్సు

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.