ETV Bharat / state

'ఆహార కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు'

ఆహార కల్తీలకు పాల్పడుతున్నవారిపై కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని హోటళ్లు, దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

revenue officers ride on hotels in guntur
ఆహార కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు
author img

By

Published : Apr 8, 2021, 10:21 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని హోటళ్లు, దుకాణాలపై రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు, హోటల్స్, బేకరీలు, కిరాణా తదితర ఆహార పదార్థాల విక్రయాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.

చికెన్, నూనె, బియ్యం, మిరియాలు, గసగసాలు తదితర ఆహార పదార్థాల్లో కల్తీ, నాణ్యత ప్రమాణాలు లోపించటాన్ని గుర్తించారు. వాటి నమూనాలను సేకరించి షాపుల యజమానుల వివరాలు నమోదు చేసుకున్నారు. ఆహార కల్తీలకు పాల్పడుతున్నవారిపై కేసులు తప్పవని వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఆ 4 రోజుల్లో రోజుకు 6 లక్షల చొప్పున వ్యాక్సినేషన్ జరగాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.