ETV Bharat / state

Macharla Murder case: హత్య కేసులో విశ్రాంత ఆర్మీ జవాను అరెస్ట్ - undefined

రాయవరంలో జరిగిన ఇద్దరి హత్య కేసులో నిందితుడు విశ్రాంత ఆర్మీ జవాను మట్టా సాంబశివరావును అరెస్ట్ చేసినట్లు గుంటూరు గ్రామీణ అదనపు ఎన్.వి.ఎస్.మూర్తి మీడియాకు వెల్లడించారు.

Macharla Murder case
హత్యకేసులో విశ్రాంత ఆర్మీ జవాను అరెస్ట్
author img

By

Published : Sep 1, 2021, 2:54 PM IST

గుంటూరు జిల్లా మాచర్లకు మండలం రాయవరంలో జరిగిన ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వి.ఎస్.మూర్తి మీడియాకు తెలిపారు. రాయవరంలో గత నెల 29న కాల్పులు కలకలం రేపాయి. రాయవరానికి చెందిన మాజీ సైనికుడు మట్టా సాంబశివరావుకు అతని సమీప బంధువులైన మట్టా బాలకృష్ణ, మట్టా శివాజీ కుటుంబంతో పొలం దారి విషయంలో కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. దీనిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదు కూడా చేసుకున్నారు.

ఆదివారం పొలం వద్ద సాంబశివరావు, బాలకృష్ణ గొడవ పడ్డారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సాంబశివరావు తన వద్ద ఉన్న పిస్టల్‌తో బాలకృష్ణ, శివాజీలపై కాల్పులు జరిపాడు. వివాదాన్ని వారించేందుకు వెళ్లిన మట్టా వీరాంజనేయులు పైనా కాల్పులు జరిపాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శివాజీ, బాలకృష్ణను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ ప్రాణాలు విడిచారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని వద్ద నుంచి పిస్టల్‌, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సాంబశివరావు అతని తండ్రి చెన్నయ్య ప్రోద్భలంతో హత్యలు చేసినట్లు వివరించారు. కాగా చెన్నయ్య పరారీలో ఉన్నాడని త్వరలోనే అతనిని కూడా అరెస్ట్ చేస్తామని వివరించారు.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో వాగు దాటుతూ వ్యక్తి గల్లంతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.