గుంటూరు జిల్లా అమరావతిలోని నివేశన స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందన్న ఫిర్యాదుతో.. స్థానిక ఆర్డీఓ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. అర్హులైన వారికి స్థలాలు కేటాయించలేదని లబ్ధిదారులు ఆర్డీవో ఎదుట నిరసన తెలిపారు. అమరావతి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఆర్డీఓ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీచదవండి.