మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలోని పలుచోట్ల స్వచ్ఛ భారత్‌పై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి జ్యూట్ సంచులను వాడాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సూచించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంపై ఐటీసీ సంస్థ అవగాహన ర్యాలీ నిర్వహించింది. ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తున్న వారికి జ్యూట్ సంచులను అందించారు.
శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలోనూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, ఐటీడీఏ ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే బొల్లా నాయుడు ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
మంగళగిరి ఏయిమ్స్ విద్యార్థులు స్పచ్ఛభారత్పై వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. అనంతరం చేనేత కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చూడండి-119 కోసం...80 వేలు పోగొట్టుకున్నాడు