రెండు నెలలుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న గుంటూరు జిల్లా ప్రజలకు.. గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో ఎంతో హాయిని కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా మారి పలుచోట్ల వర్షం పడింది. గుంటూరు నగరంలోనూ మోస్తారు వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడిపోవటంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పై కప్పులు లేచిపోయాయి. చిలకలూరిపేట, దాచేపల్లి, మంగళగిరి, మేడికొండూరు, ఫిరంగిపురం, వేమూరు, దుర్గి, కారంపూడి, బాపట్ల, ప్రత్తిపాడు, నకరికల్లు, యడ్లపాడు, నరసరావుపేట, రెంటచింతల, పల్నాడు, పిడుగురాళ్లలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది.
ఇది కూడా చదవండి.. ఈ నెల 8న కేరళ తీరానికి రుతుపవనాలు