గుంటూరు జిల్లాల్లో క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారు సరైన వసతులు లేవని ఆరోపించారు. దిల్లీ మర్కజ్ వెళ్లివచ్చిన వారితో పాటు కరోనా పాజిటివ్ తో కలిసిన వారు, వారి బంధువులను ఈ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. తామందరికీ కరోనా వ్యాధి నిర్ధరణ పరీక్షలు మళ్లీ నిర్వహించి నెగటివ్ గా తేల్చినట్టు చెప్పారు. అయినా ఇంకా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచటం ఏమిటని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తమని పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు. ఆర్.వి.ఆర్.జె.సి కళాశాల క్వారంటైన్లో ఉంటున్న వారు తమ ఆవేదనను వీడియోల ద్వారా మీడియాకు పంపించారు. కొన్ని కేంద్రాల్లో పోలీసులు, అధికారులతో అక్కడ ఉంటున్న బాధితులు గొడవకు దిగుతున్నారు. త్వరగా తమని ఇళ్లకు పంపాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:
కరోనా రోగికి సౌలభ్యం కోసం వైద్యుల నూతన ఆవిష్కరణ