ETV Bharat / state

పసిపిల్లల పాలిట వరం.. కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి

author img

By

Published : Nov 26, 2022, 7:09 PM IST

KMC Super Specialty Hospital: ప్రభుత్వ ఆస్పత్రులంటే చాలు నాసిరకం వైద్యమందించి నామమాత్రపు చికిత్సతో చేతులు దులుపుకుంటారని ప్రతితీ. అయితే తెలంగాణలోని వరంగల్ కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తోంది. కార్పోరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా వివిధ రకాల శస్త్ర చికిత్సలు అందిస్తూ పిల్లల పాలిట సంజీవనిగా నిలుస్తోంది.

కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి
KMC Super Specialty Hospital
పసిపిల్లల పాలిట వరం.. కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి

KMC Super Specialty Hospital: తెలంగాణలోని వరంగల్‌లో 11 నెలల క్రితం అత్యాదునిక సదుపాయాలతో నిర్మించిన కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పసిపిల్లల పాలిట వరంగా మారింది. మాములుగా ఆరోగ్య సమస్యలు చిన్నపిల్లలలోనే అధికంగా తలెత్తుతుంటాయి. కొంతమందికైతే తల్లిగర్భంలో నుంచే వివిధ రకాలైన జన్యుపరమైన లోపాలుంటాయి. అటువంటి వారికి చికిత్స చేయటం చాలా కష్టంతో కూడుకున్నది. కొన్నికొన్ని సందర్భాలలో లక్షలు వెచ్చించిన మెరుగైన వైద్యం దొరకని పరిస్థితి ఉంటుంది.

ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు సైతం: అయితే కేఎంసీ సూపర్‌ ఆసుపత్రి వైద్యులు మాత్రం అసాధ్యమనుకున్న ఎన్నో శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తున్నారు. ఈ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో పిల్లలకు సంబంధించిన అనేక రోగాలకు చికిత్స లభిస్తుంది. వాటిలో ప్రధానంగా కిడ్నీవాపులు, మూత్ర సమస్యల లాంటి మరెన్నో సమస్యలకు వైద్యం దొరుకుతుంది. రుపాయి ఖర్చులేకుండా నాణ్యమైన వైద్యం అందిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు సైతం వస్తున్నారు.

ప్రైవేట్‌ ఆసుపత్రిల్లో లక్షలు వెచ్చించే ఆర్థిక స్తోమత లేని మాకు బతుకుపై భరోసానిస్తున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నెలలో కనీసం 50కి పైగా శస్తచికిత్సలు నిర్వహిస్తామని వైద్యులు అంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అనవసరంగా డబ్బు వృధా చేసుకోవద్దని.. సర్కారీ దవాఖానాలో అన్ని రుగ్మతలకూ శస్త్రచికిత్సలు చేస్తున్నామని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ ఆసుపత్రిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వాసుపత్రులు సేవలందించాలని కోరుతున్నారు.

"300 నుంచి 400కు పైగా ఆపరేషన్లు చేశాం. ఇక్కడ అన్ని శస్త్రచికిత్సలు చేస్తున్నాం. మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల వారికి వైద్యం అందిస్తున్నాం. మన ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయి." -అనిల్‌రాజ్ , పిల్లల వైద్యుడు

"ఇక్కడ వైద్య సేవలు చాలా బాగున్నాయి. శస్త్ర చికిత్సలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి." - చిన్నారుల తల్లిదండ్రులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.