గుంటూరు బస్ స్టాండ్ వద్ద సైకో హల్చల్ చేశాడు. మహిళలపై దాడికి యత్నించాడు. చుట్టుపక్కన ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కూడా సైకో దాడికి ప్రయత్నించాడు. అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై గాయాలతో ఉన్న అతనికి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ప్రజలంతా బాగుండాలని అమ్మవారిని ప్రార్థించా: గవర్నర్