ETV Bharat / state

విద్యార్థులకు భోజనం పెట్టకుండానే.. యాప్​లో నమోదు - latest news on guntur government school

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండానే పెట్టినట్లు ఆ పాఠశాలలో నమోదు చేశారు. రెండు రోజులపాటు భోజనం పెట్టకుండా యాప్ లో పెట్టినట్లు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటన గుంటూరు  జిల్లా తిక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.

విద్యార్థులకు భోజనం పెట్టకుండానే యాప్​లో పెట్టినట్లు నమోదు
author img

By

Published : Nov 8, 2019, 11:44 PM IST

తనిఖీలు నిర్వహించి మాట్లాడుతున్న డీఈఓ

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండానే పెట్టినట్లుగా యాప్​లో నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని విచారణకు ఆదేశించారు. డిప్యూటీ డీఈఓ నారాయణరావు విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించగా నిజమేనని తేలడంతో... ప్రధానోపాధ్యాయుడికి మెమో జారీ చేశారు. ఇలాంటి పొరపాట్లు మరోసారి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భోజనం తయారు చేసే నిర్వహకురాలకు జ్వరం కారణంగా భోజనం పెట్టలేకపోయామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కారణాలు ఏవైనా భోజనం పెట్టకుండా పెట్టినట్లు నమోదు చేయడం తప్పేనని డీఈఓ హెచ్చరించారు.

ఇదీ చూడండి

గడువులోగా ఇళ్ల పట్టాలు సిద్ధం చేయండి: కలెక్టర్

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.