గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ఒప్పంద ఉద్యోగ కార్మికులు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఒప్పంద ఉద్యోగులకు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, కార్మిక శాఖ మంత్రులు తమను కనీసం మనుషులుగా గుర్తించడం లేదని, గడిచిన రెండు నెలల నుంచి వేతనాలు సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులను ఫిర్యాదు చేస్తే వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని వాపోయారు. ఉద్యోగుల కనీస వేతనాన్ని 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.