ETV Bharat / state

తెలంగాణలో రాష్ట్ర అధికారుల కేటగిరిలో కొందరికి ఐఏఎస్ హోదా..!

Promotion of State Service Officers: కొత్త ఏడాదిలో తెలంగాణ రాష్ట్ర సర్వీసు అధికారుల కేటగిరిలో కొందరికి ఐఏఎస్ హోదా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూతో పాటు రెవెన్యూయేతర కేటగిరీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. రెవెన్యూయేతర కేటగిరికీ సంబంధించి జనవరిన నెలలో ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది. ఐపీఎస్ హోదాకు సంబంధించి యూపీఎస్సీ కొంత సమాచారం, వివరాలు కోరినట్లు తెలిసింది..

author img

By

Published : Dec 31, 2022, 2:14 PM IST

Promotion of State Service Officers
Promotion of State Service Officers

Promotion of State Service Officers: సివిల్ సర్వీసెస్‌తో వచ్చే వారికి అదనంగా తెలంగాణ సర్వీసుకు చెందిన అధికారుల్లోనూ అనుభవం, మంచి పనితీరు కలిగిన వారికి కూడా ఐఏఎస్, ఐపీఎస్ హోదా దక్కుతుంది. రాష్ట్ర సర్వీసుకు చెందిన అధికారుల్లోనూ కొంత మందికి ఈ హోదా లభిస్తుంది. ఐఏఎస్​కు సంబంధించి రెవెన్యూ, రెవెన్యూయేతర కేటగిరీల్లో అధికారులకు హోదా లభిస్తుంది. రెవెన్యూ కేటగిరీలో సీనియార్టీ ఆధారంగా ఖాళీలను బట్టి డిప్యూటీ కలెక్టర్లకు ఐఏఎస్​ హోదా ఇస్తారు. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఐదు ఖాళీలు ఉన్నాయి.

ఇందుకోసం ఇప్పటికే ఐదు పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - యూపీఎస్సీకి పంపింది. ఐదుగురు సీనియర్ డిప్యూటీ కలెక్టర్ల పేర్లు అందులో ఉన్నాయి. వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సంబంధిత కమిటీ వారికి ఐఏఎస్​ హోదా ఇస్తుంది. అయితే రెవెన్యూ కేటగిరీలోనే పదోన్నతుల ద్వారా డిప్యూటీ కలెక్టర్లు అయిన వారికి సంబంధించి కూడా ఏడు, నుంచి ఎనిమిది వరకు ఖాళీలు ఉన్నాయని అంటున్నారు. ఆ ఖాళీలకు 30 మంది వరకు అర్హులు ఉన్నట్లు చెప్తున్నారు.

తమకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించి జాబితాను పంపాలని వారు కోరుతున్నారు. ఇక రెవెన్యూయేతర కేటగిరీలోనూ ఐదు ఖాళీలున్నాయి. ఈ ఖాళీలకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి అర్హులైన అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వడపోశారు. ఐదు ఖాళీలకు ఒక్కో పోస్టుకు ఐదుగురి పేర్ల చొప్పున 25 పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం.. యూపీఎస్సీకి నివేదించింది. ప్యానల్ జాబితాపై గురువారం దిల్లీలో ఎంపిక కమిటీ సమావేశమై అన్ని అంశాలను చర్చించింది.

యూపీఎస్సీ, డీఓపీటీకి చెందిన అధికారులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి కమిటీలో ఉన్నారు. జాబితాలోని అధికారుల ఏసీఆర్లు, పనితీరు సహా అన్ని అంశాలను పరిశీలించారు. 25 మంది అధికారులకు జనవరి మొదటి లేదా రెండో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది.

ఆ తర్వాత ఐదు ఖాళీలకు గాను ఐదుగురు అధికారులకు యూపీఎస్సీ ఐఏఎస్​ హోదా కల్పిస్తుంది. పోలీస్ అధికారులకు సంబంధించి కూడా ఐపీఎస్ హోదా ఇచ్చే ప్రక్రియ గతంలోనే ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జాబితా కూడా పంపారు. అయితే సదరు అధికారులకు సంబంధించి కొన్ని వివరాలు, అదనపు సమాచారాన్ని యూపీఎస్సీ కోరినట్లు సమాచారం.

రాష్ట్ర సర్వీసు అధికారుల కేటగిరిలో కొందరికి ఐఏఎస్ హోదా..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.