ETV Bharat / state

బేరం లేక భారంగా.. స్పిన్నింగ్ మిల్లుల నిర్వహణ - problems of spining mills in andhrapardesh state

రాష్ట్రంలో స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థిక మందగమనం పారిశ్రామికవర్గాలను మరింత హడలెత్తిస్తోంది. డిమాండ్ కరవై... మిల్లుల్లో దారం నిల్వలు పేరుకుపోతున్నాయి. వ్యవసాయం తర్వాత రెండో పెద్ద పరిశ్రమగా పేరుగాంచిన చేనత, జౌళి పరిశ్రమలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గండం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వాల చేయూత కోసం ఎదురుచూస్తున్నాయి.

problems of spining mills in andhrapardesh state
author img

By

Published : Sep 20, 2019, 7:02 AM IST

Updated : Sep 20, 2019, 7:10 AM IST

కొన్నేళ్లుగా చేనేత, జౌళి పరిశ్రమలను కష్ట, నష్టాలు వెంటాడుతున్నాయి. విదేశీ వాణిజ్య పరిణామాలకు తోడు నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు వంటి పరిణామాలు పత్తి ఆధారిత పరిశ్రమలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా విలువ ఆధారిత ఉత్పత్తులు కాకుండా..... దారం ఉత్పత్తికే ఎక్కువ మిల్లులు పరిమితం కావడం నష్టాలకు దోహదం చేశాయి. పత్తి నుంచి దారం తీసే మిల్లులు దినదినగండంగా నడుస్తున్నాయి.

భేరం లేక భారంగా మారుతున్న స్పిన్నింగ్ మిల్లులు!

ప్రోత్సహాకాల కోసం ఎదురుచూపులు!

రాష్ట్రంలో 124 స్పిన్నింగు, 260 జిన్నింగ్, 11 పత్తి నుంచి నూనె తీసే మిల్లులున్నాయి. ఈ మిల్లుల ద్వారా రాష్ట్రంలో ఏడాదికి 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల బేల్స్ ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి ఎగుమతి చేసేవి 10 నుంచి 15 లక్షల టన్నులే. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ ద్వారా 4 లక్షల 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. నాణ్యమైన దారం, నిరంతర విద్యుత్, అందుబాటులో నౌకాశ్రయాలు... రాష్ట్రంలో చేనేత, జౌళీ పరిశ్రమలకు అనువుగా ఉన్నాయి.

ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ మూడేళ్లుగా పరిశ్రమలు నష్టాలతో సతమతమవుతున్నాయి. మారిన ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతులకు మద్ధతు ధర పెంపు వంటి అంశాలు.... స్పిన్నింగు, జిన్నింగు మిల్లుల భవిష్యత్తును ప్రభావితం చేశాయని చెబుతున్నారు మిల్లుల యజమానులు. మిల్లుల్ని గట్టిక్కేంచేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని వీరు కోరుతున్నారు.

పారిశ్రామిక వృద్ధిలో మందగమనం కూడా... పారిశ్రామికవర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు నష్టాల్లో ఉండగా... భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగతే మిల్లుల మూసివేతకు దారితీయవచ్చని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశాన్ని ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో పరిశ్రమలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. పరిస్థితిని చక్కదిద్దేలా కృషి స్తామని... స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

స్వదేశి తయారీకి ప్రాధాన్యమిస్తున్న కేంద్రప్రభుత్వం... సమస్యలతో ఎదురీదుతున్న చేనేత, జౌళి పరిశ్రమను గట్టెక్కించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి:

గిరిజన కళాకృతులు... చూస్తే కళ్లు జిగేల్

Intro:AP_ONG_81_19_ACCIDENT_EO_MRUTI_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా కనిగిరి సమీపం లోని పొగాకు బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవస్థాన ఈఓ నారాయణరెడ్డి మృతి చెందాడు. కారు టైరు పేలి వంతెనను ఢీకొన్న ఈ దుర్ఘటన లో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఎస్ పురం మండలం లోని భైరకొన దేవాలయ ఇంచార్జ్ ఈఓ గాను నారాయణరెడ్డి పనిచేస్తున్నాడు. Body:రోడ్డు ప్రమాదం.Conclusion:8008019243.
Last Updated : Sep 20, 2019, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.