నైరుతి రుతుపవనాల రాకకు ముందే తుపాన్లు పలకరిస్తున్నాయి. భారీ వర్షాలతో పట్టణాల్లో వరద నీరు పారుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రుతుపవనాల రాకతో కురిసే వర్షాలకు నగరాలు, పట్టణాల్లో వరద ముంపు సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఈ నెలాఖరుకు రుతుపవనాల ఆగమనం ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలతో పట్టణాల్లో ముంపు సమస్య రాకుండా ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరముంది. వరద ముంపుపై దృష్టి సారించకుంటే ఊహించని నష్టంతో పాటు ఇబ్బందులు తప్పవని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి.
పట్టణీకరణకు తగ్గట్లుగా మురుగు పారుదల వ్యవస్థ లేకపోవడంతో వరద ముంపు సమస్య తలెత్తుతోంది. చిన్నపాటి వర్షానికే చిగురుటాకుల్లా కొన్ని కాలనీలు వణకిపోతున్నాయి. వేలాది కుటుంబాలు ముంపు సమస్య బారినపడి సామాజిక భవనాలు, పాఠశాలలు, కల్యాణ మండపాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కారం చూపే చర్యలు లోపించాయి. ఏ పట్టణంలో చూసినా వర్షాలు ఆరంభమైన తర్వాత వరద ముంపు కాల్వల పూడికతీత, మరమ్మతు పనులు చేపడుతున్నారు. వేసవిలోనే ఆక్రమణల తొలగింపు, అవసరమైనచోట కాల్వల వెడల్పు, ముంపునకు అవకాశం లేకుండా నిర్మాణాలు చేపట్టడం చేయట్లేదు. ఒక్కో పురపాలక సంఘం సగటున రూ.10లక్షల నుంచి రూ.30లక్షల వరకు వర్షాకాలం పనులకు నిధుల్ని కేటాయిస్తుంది. మొక్కుబడి పనులతో నిధులు వృథా అవుతున్నాయి. నాలుగైదు సంవత్సరాలు వరద ముంపు నివారణ చర్యలకు వినియోగించే నిధుల్ని ఒకేసారి ఖర్చు చేస్తే ముంపు సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశముంటుంది.
● రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసముండే తాడేపల్లి పురపాలక సంఘం మినహాయించి మిగిలిన అన్ని పట్టణాల్లోనూ వరద ముంపు సమస్య ఉంది. తాడేపల్లి కొండ ప్రాంతం కావడంతో ఆ ఇబ్బంది లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పట్టణాల్లో వరద ముంపు బారినపడే కాలనీలివే.
పట్టణం వరద ముంపు సమస్య ఉన్న కాలనీలు
సత్తెనపల్లి నాగన్నకుంట, యానాదికాలనీ, వెంకటపతినగర్, కొత్తపేట, చెంచుకాలనీ, వడ్డవల్లి, ముస్లింపేట, నిర్మలానగర్, దోబీఘాట్, తెనాలి గురవయ్య కాలనీ, చంద్రబాబునాయుడుకాలనీ,భాస్కరరావుదిబ్బ, వైకుంఠపురం రోడ్ఢు,పొన్నూరు 19వ వార్డు ఎస్సీ కాలనీ, డీవీసీ కాలనీ, డీఆర్‌కే కాలనీ,మంగళగిరి రత్నాల చెరువు ఎస్టీ కాలనీ, జగ్గయ్యపేట ఎర్ర కాలువ కాలనీ, గుడివాడ పంచమంటికాలనీ, కొమరగుండం, చెంచుపేట, చెంచుకాలనీ, నూజివీడు మొఘల్ చెరువు, ఎన్టీఆర్ కాలనీ, నందిగామ చెరువుబజారు, మొక్కపాటికాలనీ, రైతుపేటడౌన్, బీవీఆర్‌కాలనీ.
- ఇదీ చూడండి.
యాసిడ్ పోసుకొని.. వ్యవసాయశాఖ ఉద్యోగిని ఆత్మహత్య