ETV Bharat / state

జగన్ వెంట అతని కుటుంబమే లేదు: ప్రత్తిపాటి పుల్లారావు

Prathipati Pulla Rao Comments: ఒకే రాష్ట్రం..ఒకే కుటుంబం అంటున్న జగన్ వెంట అతని కుటుంబమే లేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పెత్తందారీ పోకడలకు నిలువెత్తు నిదర్శనం మాచర్ల అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మాచర్లలో బడుగులను చంపించింది వైసీపీ నేతలు కాదా అని మండిపడ్డారు.

Prattipati Pulla Rao
ప్రత్తిపాటి పుల్లారావు
author img

By

Published : Dec 24, 2022, 3:25 PM IST

Prathipati Pulla Rao Comments: పెత్తందార్లు, పేదలంటూ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఒకే రాష్ట్రం.. ఒకే కుటుంబం అంటున్న జగన్ వెంట అతని కుటుంబమే లేదని మండిపడ్డారు. బాబాయిని హత్య చేసిన వాళ్లని కాపాడే జగన్.. కుటుంబం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆక్షేపించారు. జమీందారులను మించిన ప్యాలెస్​లను కట్టుకున్న జగన్ పేదవాడా.. పెత్తందారా అని ధ్వజమెత్తారు. పేదల రక్తాన్ని జలగలా తాగుతోంది ఎవరని దుయ్యబట్టారు. బీసీలను నిలబెట్టి మాట్లాడే వైసీపీ నేతల్ని పెత్తందార్లు కాక మరేమీ అనాలని ప్రశ్నించారు.

ఉద్యోగస్తులు కాళ్లు పట్టుకుంటే తప్ప పనులు కావని మంత్రి బొత్స సలహా ఇవ్వటం పెత్తందారీతనాన్ని ప్రొత్సహించడం కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగులకిచ్చిన సలహా పాటించే బొత్స పదవిలో ఉన్నారా అని నిలదీశారు. వైసీపీలో సీఎం సామాజిక వర్గం నేతల పెత్తనం ఉందని బొత్స కూడా బాధ పడుతున్నారని ఎద్దేవా చేసారు. ఆ బాధ నుంచే బొత్స ఉద్యోగులకు సలహా ఇచ్చి ఉంటారన్నారు. పెత్తందారీ పోకడలకు నిలువెత్తు నిదర్శనం మాచర్ల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో బడుగులను చంపించింది వైసీపీ నేతలు కాదా అని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.