ETV Bharat / state

తెనాలిలోనే స్వీయ రక్షణ పరికరాల తయారీ

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులకు కావాల్సిన స్వీయ రక్షణ పరికరాలకు డిమాండ్ పెరిగింది. కొన్నిచోట్ల వీటి కొరత ఏర్పడింది. ఎంతో మందికి ఊపిరి పోస్తున్న వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించే ఈ పరికరాల ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీటి తయారీ బాధ్యతను తెనాలిలోని ఓ పరిశ్రమకు అప్పగించింది.

ppe kits are manufacturing in tenali
ppe kits are manufacturing in tenali
author img

By

Published : Apr 4, 2020, 11:45 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్​ సోకిన వారికి చికిత్స అందించే వైద్యుల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వారికి అవసరమైన స్వీయ రక్షణ పరికరాల(పీపీఈ) కొనుగోలును ప్రారంభించింది. పీపీఈలను తయారు చేయాలని గుంటూరు జిల్లా తెనాలిలోని సత్యసాయి డిస్పో నీడ్స్​ అనే ఓ చిన్న తరహా పరిశ్రమను ప్రభుత్వం కోరింది. ఈ రంగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఈ సంస్థ తక్కువ ధరకే ప్రభుత్వానికి పీపీఈలను అందిస్తోంది. మాస్కుల నుంచి షూ కవర్ వరకు వైద్యులకు కావాల్సిన అన్ని పరికరాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ పీపీఈల తయారీ కోసం ఇక్కడి సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారు. తక్కువ సమయంలోనే నాణ్యమైన పీపీఈలను తయారు చేసి సరఫరా చేస్తున్నారు.

సత్యసాయి డిస్పో నీడ్స్​ యజమానితో ముఖాముఖి

ఇదీ చదవండి: ర్యానిటిడిన్‌ వద్దే వద్దు... వినియోగిస్తే కాన్సర్​ ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.