గుంటూరులో విద్యుత్ విజిలెన్స్ అధికారులు... విస్తృత దాడులు చేశారు. అక్రమ కనెక్షన్లు, అక్రమ బిల్లింగ్ వ్యవహారాలు గుర్తించారు. 62 మంది అధికారులు, 140 మంది విద్యుత్ సిబ్బంది... 62 బృందాలుగా ఏర్పడి కృష్ణానగర్, శ్యామలానగర్లో 5,082 చోట్ల తనిఖీలు నిర్వహించారు అనుమతి లేకుండా విద్యుత్ వాడుతున్న 203 మందిని గుర్తించారు.
వీరికి రూ.7.99 లక్షల అపరాధ రుసుం విధించారు. అనుమతించిన కేటగిరీ కాకుండా వేరే కేటగిరీలో విద్యుత్తు వాడుతున్న 8 మంది వినియోగదార్ల నుంచి రూ.1.02 లక్షలు వసూలుకు నోటీసులు జారీచేశారు. అధికంగా విద్యుత్ లోడు వాడుతున్న 195 మంది వినియోగదార్ల నుంచి రూ.6.97 లక్షలు వసూలు చేయనున్నారు.
ఇదీ చదవండి: