ETV Bharat / state

'ప్రజలు మార్పు కోరితే.. వైకాపా నేతలు అవినీతికి పాల్పడుతున్నారు'

author img

By

Published : Dec 27, 2020, 9:10 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. అరాచక శక్తుల నుంచి సంగం డైరీని కాపాడుకోవలసిన బాధ్యత తమపై ఉందన్న నరేంద్ర కుమార్... ఇళ్ల పథకాల పేరుతో వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరితే దోపిడీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ponnuru ex mla dhoolipalla narendra kumar fire on ycp  government
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

తమ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలుసుకోవాలంటే... నియోజకవర్గంలోని ఏ ఇంటిని సందర్శించినా తెలుస్తుందని గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగం డెయిరీ వ్యవస్థాపన నుంచి అభివృద్ధి వరకు తాము ఎంతో కృషి చేశామని అన్నారు. అరాచక శక్తుల నుంచి సంగం డెయిరీని కాపాడుకోవలసిన బాధ్యత కూడా తమదేనని స్పష్టం చేశారు. డీవీసీ ఆస్పత్రి ద్వారా కరోనా సమయంలో ఎంతోమందికి చికిత్స చేసి, వారి ప్రాణాలు నిలిపామని అన్నారు.

మిగతావి ఏమయ్యాయి?

కొమ్మమూరు కాలువ బ్రిడ్జి నిర్మాణానికి తెలుగుదేశం హయాంలోనే నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రెండేళ్ల కాలంలో ఇళ్ల పథకాల పేరుతో వైకాపా నాయకులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నిడుబ్రోలులో ప్రభుత్వం ఎకరానికి రూ.40లక్షలు చెల్లిస్తే... రైతులకు రూ.30లక్షలు మాత్రమే చేరాయని, మిగిలిన రూ.10లక్షలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

మార్పు కోరితే... దోపిడీలా ?

ప్రజలు మార్పుకోరి వైకాపాకు అధికారం కట్టబెడితే... వైసీపీ నేతలు అవినీతి, అరాచకాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం నుంచి ప్రజల తరఫున క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

రేపు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.