ETV Bharat / state

సీఐ సీతయ్య... ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే..! - ci venkanna chowdhary

ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో ఓ సినిమాలోని సీతయ్య పాత్రను తలపిస్తున్నారు. నిబంధనల విషయంలో తాను ఎవరి మాట విననని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సరే ఆంక్షలను పాటించాలని కాస్త కఠినంగా చెప్పాడు. ఫలితంగా అతణ్ని అక్కడినుంచి వేరేచోటుకు బదిలీ చేశారు. అసలు ఎవరా పోలీస్... ఏమిటీ అతని కథ... ఓసారి చూద్దాం.

Police Officer strictly following the rules in check post
సీఐ సీతయ్య... ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే..!
author img

By

Published : Mar 31, 2020, 4:24 PM IST

సీఐ సీతయ్య... ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే..!

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై లాక్​డౌన్ అమలుకు చెక్​పోస్టు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ చెక్​పోస్టు పర్యవేక్షణాధికారిగా సీఐ వెంకన్నచౌదరిని నియమిస్తూ గ్రామీణ ఎస్పీ విజయారావు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ బాధ్యతలు తీసుకున్న వెంకన్నచౌదరి పనితీరుకు స్థానికులు, అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల యజమానులు బెంబేలెత్తిపోయారు. విధి నిర్వహణలో ఓ సినిమాలో బాధ్యతగల పోలీస్ అధికారి సీతయ్య పాత్రను తలపిస్తూ పని చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర సేవల వాహనాలను మాత్రమే అనుమతించారు.

ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోలేదు ఈ సీఐ. సోమవారం చిలకలూరిపేట తహసీల్దార్ వాహనాన్ని నిలిపివేశారు. తాను విధి నిర్వహణలో ఉన్నానని ఆమె చెప్పగా వదిలేశారు. వివిధ ప్రాంతాల నుంచి వైద్య సేవలు అందించేందుకు వెళ్తున్న వైద్యుల కార్లనూ నిలిపివేశారు. అత్యవసర సేవలు అందించాలని వారు చెప్పిన పట్టించుకోలేదు. ఒంగోలులో వైద్యులుగా పని చేసేవారు గుంటూరు నుంచి ఎందుకు వెళ్తున్నారని... అనుమతించబోనని వెంకన్నచౌదరి తేల్చిచెప్పారు.

జిల్లా సరిహద్దులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా... పక్క జిల్లాల నుంచి వందల సంఖ్యలో అవసరం లేని వాహనాలు వస్తున్నాయని సీఐ వెంకన్నచౌదరి చెప్పారు. అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వనని స్పష్టం చేశారు. గత రెండుమూడు రోజుల్లో ఐఏఎస్, గ్రూప్-I అధికారులనూ నిలిపివేశారు. ఇలాంటి అధికారి ఉంటే ఇబ్బందులు తప్పవని... పట్టువిడుపులు ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వెంకన్నచౌదరిని ఆ విధుల నుంచి తప్పించి వేరేచోటుకు పంపడం కొసమెరుపు.

ఇదీ చదవండీ... త్వరలో ఇంటింటికీ నిత్యావసరాలు: కొడాలి నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.