ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్​: ఇక మాటల్లేవ్​... లాఠీ దెబ్బలే! - police lotty charge in guntur lockdown live updates

గుంటూరులో లాక్​డౌన్​ నిర్వహిస్తున్న పోలీసులు.. లాఠీలకు పని చెబుతున్నారు. నిన్నటివరకూ... కౌన్సిలింగ్​ ఇచ్చినా ప్రజలు రోడ్డుపైకి అనవసరంగా వస్తున్నారంటూ విసుగుచెందారు. కనిపిస్తే చాలు. లాఠీ విరిగిపోయేట్లు బాదేస్తున్నారు.

police lotty  charge  on people who came out in lockdown period at guntur dst
గుంటూరులో లాక్​డౌన్​లో బయటకొచ్చిన వారిని కొడుతున్న పోలీసులు
author img

By

Published : Mar 25, 2020, 5:33 PM IST

గుంటూరులో లాక్​డౌన్​ అమలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వీధుల్లో, ప్రధాన రహదారుల్లో కొందరు వాహనాలపై కనీసం మాస్క్​లు లేకుండా సంచరిస్తుండడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటివారిని నాలుగు తన్ని మాస్క్ లు వేయించి పంపిస్తున్నారు. ఇకపై పని లేకుండా వీధుల్లో తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేయాలంటూ పోలీసు సిబ్బందికి నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. పోలీసులు, పురపాలక సంఘం అధికారులు దుకాణాలను మూయించారు. రోడ్లపై తిరిగే వాహనాలను ఎక్కడికక్కడి నుంచే వెనక్కి పంపుతున్నారు. రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆలయాలు భక్తులు లేక బోసిపోయాయి. వీధులన్నీ ట్యాంకర్లతో కడుగుతున్నారు. ప్రధాన వీధుల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక వాష్ బేషిన్ లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంగళగిరికి వచ్చే రహదారులన్నీ మూసేశారు.

గుంటూరు పూల మార్కెట్​ను పోలీసులు మూసివేయించగా.. పండుగ కోసం తెప్పించిన పూలన్నీ వృథా అయ్యాయి. కూరగాయల విక్రయానికి అనుమతించిన పోలీసులు పూలు అమ్మటాన్ని నిలిపివేశారు. ఫలితంగా.. గుట్టలు గుట్టలుగా పూలు మార్కెట్లో పేరుకుపోయాయి.

ఇదీ చూడండి:

కుటుంబంతో రోడ్డెక్కిన వ్యక్తికి.. పోలీసుల 'మర్యాద'!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.