అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం సంఘాలు తమ ఆందోళనను ఉద్ధృతం చేశాయి. గురువారం చలో అసెంబ్లీకి ఐకాస నేతలు పిలుపునివ్వగా.. వివిధ రాజకీయ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. అప్రమత్తమైన పోలీసులు పలువురు నేతలను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. గుంటూరులో తెదేపా నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయం ముట్టడికి యత్నించిన సలాం పోరాట సమితి నాయుకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి లాలాపేట స్టేషన్కు తరలించారు. సలాం కేసును సీబీఐకి అప్పగించాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహమ్మద్ డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మండల అధ్యక్షుడు ఉండవల్లి సోమసుందరాన్ని పములవారిగుడెంలో గృహనిర్బంధం చేశారు.
అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ నెల్లూరు జిల్లా ముస్లిం హక్కుల న్యాయ పోరాట సమితి చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మద్రాస్ బస్టాండ్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన సమితి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్కు తరలించారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని నాయకులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: