గుంటూరు జిల్లా మంగళగిరి 6వ పోలీస్ పటాలంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బెటాలియన్స్ ఐజీ బత్తిలి శ్రీనివాసులు ప్రారంభించారు. బెటాలియన్‌లోని 1200 మంది పోలీసులు, డీజీపీ కార్యాలయ సిబ్బందికి వైద్యులు పరీక్షలు చేశారు. పోలీసులు తమ ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదని ఐజీ అన్నారు. దీనివల్ల ఎంతో మంది పోలీసులు మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతున్నారని తెలిపారు. దీన్ని నివారించేందుకే వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: