గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని ఎస్బీఐలో శనివారం చోరి జరిగిన సంగతి తెలిసిందే. దుండుగులు రూ.85 లక్షలను అపహరించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. 5 బృందాలుగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంలో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు కెమరాకు చిక్కారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఇదీచదవండి