ETV Bharat / state

వీడిన మర్టర్​ మిస్టరీ.. మెుదటి భార్య బంధువులే హంతకులు - గుంటూరు జిల్లా హత్య కేసు

గుంటూరు జిల్లా గంగలకుంట గ్రామానికి చెందిన నాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. మెుదటి భార్య బంధువులే వలపన్ని చంపినట్టు గుర్తించారు. కేసుకు సంబంధించిన ఆరుగురు నిందితులను అరెస్ట్​ చేసినట్టు గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్ వెల్లడించారు.

poli arrested six in murder case in guntur district
వీడిన మర్టర్​ మిస్టరీ.. మెుదటి భార్య బంధువులే హంతకులు
author img

By

Published : Jan 30, 2021, 10:33 PM IST

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని గంగలకుంట గ్రామానికి చెందిన కంచర్ల నాగరాజు హత్య మిస్టరీ వీడింది. హత్య కేసులోని ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్ వెల్లడించారు. మాచర్ల సర్కిల్ పోలీస్​స్టేషన్​లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన హత్య ఉదంతాన్ని వివరించారు.

భార్య ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు..

మాచర్లలోని ఒక ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్​గా ఉండే కంచర్ల నాగరాజు.. ఈ నెల 20వ తేదీన నరసరావుపేటలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. 21వ తేదీ వరకు ఇంటికి రాకపోవడం.. ఫోన్ పనిచేయకపోవడంతో భార్య రమాదేవి భర్త ఆచూకీ కోసం వెల్దుర్తి ఠాణాలో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం గాలించారు.

మెుదటి భార్య బంధువులే హతమార్చారు..

నాగరాజు 2013లో గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో పీజీ చదివేరోజుల్లో నరసరావుపేట మండలంలోని పెద్దతురకపాలెం గ్రామానికి చెందిన ఆసియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కుటుంబసభ్యులకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో గుంటూరులో కాపురం పెట్టారు. కొద్దీ నెలలకే ఆసియా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె కుటుంబసభ్యులు నాగరాజుపై నగరపాలెం పోలీస్​స్టేషన్​లో కేసు పెట్టారు. 2017లో ఈ కేసును కోర్టు కొట్టి వేసింది. నాగరాజు మరో వివాహం చేసుకున్నాడు. నాగరాజు వల్లే తమ అమ్మాయి చనిపోయిందని అతనిపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా నాగరాజును చంపి పగ తీర్చుకోవాలని అనుకున్నారు. అబ్దుల్ సలీమ్, నబీజాని, మీరా జిలానీ, పఠాన్ అక్బర్ వలి, సయ్యద్ అబ్బాస్, సయ్యద్ పిర్​వలీ, షేక్ టూబాటి సలీమ్​తో కలసి ప్రణాళిక రచించారు.

అమ్మాయినంటూ ఫేస్​బుక్​ వల..

రెండుసార్లు మాచర్లకు వచ్చి నాగరాజును చంపేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో కొత్త మార్గం సిద్ధం చేశారు. అబ్దుల్ సలీమ్ అనే ప్రధాన నిందితుడు అమ్మాయిలగా ఫేస్ బుక్ ఖాతాను సృష్టించాడు. నాగరాజు ఫేస్ బుక్ మెసెంజర్​కు సందేశాలు పెట్టి ట్రాప్ చేశాడు. ఈ నెల 20వ తేదీన చిలకలూరిపేటలోని సుభానీనగర్​లో ఉన్న అబ్దుల్ సలీమ్ ఇంటికి ముందుగా అనుకున్న ప్రకారం నాగరాజుని రప్పించాడు. ఇంట్లోకి రాగానే అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి మెడకు తాడువేసి చంపారు. తరువాత నాగరాజు మృతదేహాన్ని ఓ అట్ట పెట్టెలో పెట్టి.. కారు డిక్కీలో వేసుకొని నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దతురకపాలెం గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడి మట్టి క్వారీలోని నిర్మానుష్య ప్రాంతానికి నాగరాజు మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ కేసులో నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డు కోసం సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

వెల్ఫేర్ సెక్రెటరీపై దుండగుల దాడి: రూ.19 లక్షలు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.