గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన మిత్రులు కొప్పుల జాషువా, షేక్ ఖాసిం 2021 ఏప్రిల్ 30న కలిసి మద్యం తాగారు. అదే రోజు జాషువా మృతిచెందాడు. ఈ ఘటనపై ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంపై షేక్ ఖాసింను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
జాషువా చనిపోవడానికి, తనకు ఎలాంటి సంబంధమూ లేకపోయినా.. ఈ కేసులో ఇరికించారని ఖాసిం ఆరోపిస్తూ వచ్చాడు. అంతేకాదు.. లక్ష రూపాయలు లంచం ఇస్తే వదిలేస్తామని ఎస్సై అజయ్ బాబు అన్నారని ఖాసిం ఆరోపించారు.
అయితే.. అంత మొత్తం ఇచ్చుకోలేనని చెబితే.. విడతలవారీగా ఇవ్వాలని పోలీసులు చెప్పారంటూ బాధితుడు ఖాసిం.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఖాసిం వద్ద నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా.. ఫిరంగిపురం ఎస్సై అజయ్ బాబు, హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, పోలీస్ వాహన ప్రైవేట్ డ్రైవర్ షఫీ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
AP High Court: బిల్లులను ఏళ్ల తరబడి ఎందుకు చెల్లించట్లేదు? - హైకోర్టు