ETV Bharat / state

నలుగురు దోపిడీ దొంగల అరెస్టు

నలుగురు దారి దోపిడీ దొంగలను గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరులో దారి దోపిడీ దొంగలు
author img

By

Published : Nov 8, 2019, 12:42 PM IST

దారి దోపిడీ దొంగలపై మాట్లాడుతున్ననరసరావుపేట గ్రామీణ సీఐ వై.అచ్చయ్య

గుంటూరులో నలుగురు దారి దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారుల్లో ఆగి ఉన్న లారీలతో పాటు.. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు గుర్తించారు. దాడులు చేసి వారి నుంచి వాహనాలు, నగదు, సెల్‌ఫోన్లు లాక్కుంటున్నారని తెలిపారు. గత నెల 31న ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఆగి ఉన్న ఇనుప చువ్వలలోడు లారీ డ్రైవర్‌ను, క్లీనర్‌పై దాడి చేసి వారి నుంచి రూ.15 వేలు, సెల్‌ఫోన్‌ లాక్కొని పారిపోగా లారీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్టు నరసరావుపేట గ్రామీణ సీఐ వై.అచ్చయ్య అన్నారు.

గుంటూరు చుట్టుగుంటకు చెందిన వాసిమళ్ల వంశీకృష్ణ, దేవప్రసాద్‌, యర్రబోతుల అనిల్‌కుమార్‌, సాధినేని ప్రవీణ్‌కుమార్‌ దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దొంగల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Intro:ap_gnt_81_29_narasaraopeta_lo_5k_run_avb_ap10170

నరసరావుపేటలో 5కే రన్.

ఒకే జీవితం, ఒకే గుండె, ఒకే కుటుంబం, నడకతో గుండె పదిలం: కారసాని శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గుండె వైద్యనిపుణులు.

ఒకే జీవితం, ఒకే గుండె, ఒకే కుటుంబం, నడకతో గుండె పదిలమని నరసరావుపేట లోని ప్రముఖ గుండె వైద్య నిపుణులు కారసాని శ్రీనివాసరెడ్డి అన్నారు.

ప్రపంచ గుండె దినోత్సవం సందర్బంగా నరసరావుపేట పట్టణం లో 5కే రన్ కార్యక్రమాన్ని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. 5కే కార్యక్రమాన్ని శాససభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సత్తెనపల్లి రోడ్డులోని కోడెల స్టేడియం నుండి బయలుదేరిన 5కె నడక కార్యక్రమం బరంపేట, పెద్ద చెరువు, పల్నాడురోడ్డు, మల్లమ్మ సెంటర్ మీదుగా మరల కోడెల స్టేడియం వరకు సాగింది. కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది పైగా పాల్గొన్నారు.

Body:5కె రన్ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి వారానికి ఒక్కసారైనా నడచే కార్యక్రమాన్ని పెట్టుకోవాలన్నారు. నడక వలన దేహానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ దినోత్సవం సందర్భంగా కారసాని చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. అదేవిధంగా ఆయన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించి గుండెను కాపాడుకోవాలన్నారు.

Conclusion:అనంతరం ప్రముఖ గుండె వైద్య నిపుణులు కారసాని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి దిన చర్యల్లో నడకను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతి మనిషికీ ఒకే జీవితం, ఒకే గుండె, ఒకే కుటుంబం కాబట్టి వీటిని జయించాలంటే నడక ఒక్కటే ప్రధాన మార్గమన్నారు. గుండెను సంరక్షించడం వల్ల శరీరంలో అనేక వ్యాధులను పారద్రోలవచ్చన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు బీపీ, షుగర్, రక్తానికి సంబంధించిన టెస్టులు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నడక వలన రక్తశుద్ధి జరుగుతుందన్నారు.

బైట్ 1: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే.
బైట్ 2: కారసాని శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గుండె వైద్య నిపుణులు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.