ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన.. వ్యక్తిపై పోలీసుల దాడి

గుంటూరు జిల్లాలో గంజాయి తాగి ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్నారని... కృష్ణాకెనాల్ రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఇద్దరు వ్యక్తులను స్టేషన్​కు తరలించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించగా... రాంబాబు అనే వ్యక్తి స్టేషన్ వద్దే బైఠాయించి ఆందోళనకు దిగాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎంత చెప్పినా వెళ్లకపోవటంతో... ఆగ్రహించిన పోలీసులు అతడిపై దాడి చేశారు.

Police attack on a man protesting in front of tadepalli police station
పోలీస్​ స్టేషన్​ ముందు ఆందళన చేస్తున్న వ్యక్తిపై పోలీసుల దాడి
author img

By

Published : Nov 30, 2020, 4:32 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న ఓ యువకుడిపై ఎస్సై శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. గంజాయి తాగిన ఓ వ్యక్తి తనను కొడుతున్నా డని... రాంబాబు అనే వ్యక్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అక్కడనుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఎంత చెప్పినా రాంబాబు వినకపోవటంతో... ఎస్సై శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు.

ఈ వ్యవహారంపై పోలీసులను వివరణ కోరగా గంజాయి కేసులో రెండు వర్గాలు ఘర్షణ పాల్పడుతున్నారని... కృష్ణాకెనాల్ రైల్వే పోలీసులు ఫిర్యాదు మేరకు వాళ్లని స్టేషన్​కు తీసుకువచ్చినట్లు తెలిపారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఇరువురిని పంపించగా... రాంబాబు స్టేషన్ ముందు బైఠాయించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఖాతాలు కొల్లగొట్టే కేటుగాళ్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.