గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారి దోపిడీకి పాల్పడిన జాన్ వెస్లీ అనే వ్యకిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గతంలో 24 కేసులున్నాయని వెల్లడించారు. శనివారం రాత్రి నులకపేట వద్ద.. జాన్‌వెస్లీ, అతని అనుచరుడు రహీమ్‌లు మరో వ్యక్తితో కలిసి ఇద్దరు యువకులను అడ్డగించారు. వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ఇరువురి వద్ద నుంచి చరవాణి, రూ. 1,600లను లాక్కున్నారు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు.
ప్రాణ భయంతో అక్కడి నుంచి బయటపడిన ఇద్దరు వ్యక్తులు.. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు జాన్ వెస్లీని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో ఇటీవల జరిగిన రూ. 50 లక్షల చోరీ కేసులోనూ అతడి పాత్ర ఉందని తెలిసింది. వారి ముఠాలో ఎంత మంది ఉన్నారు? ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారనే విషయాలపై లోతైన విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: