కృష్ణానది మధ్యలో లంకల్లో దట్టమైన చెట్ల పొదల మధ్య మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పేకాటరాయుళ్లు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పేకాట ఆడేవారు నది మధ్యలోని లంకలకు చేరుకోవటానికి నాటు పడవలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తతంగం అంతా.... రేయింబవళ్లు పోలీస్ బందోబస్తు ఉండే రాజధాని ప్రాంతమైన కరకట్ట నుంచే సాగుతున్నా...వారికి మాత్రం కనిపించడం లేదు.
స్థానికంగా శివ శైవక్షేత్రం పక్క నుంచి నది మధ్యలోకి.... నాటు పడవల్లో గుంపులు గుంపులుగా తరలుతున్నారు. తుళ్లూరు, అమరావతి, పెదకూరపాడు, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు నిత్యం వందల సంఖ్యలో వచ్చిపోతున్నారు. విజయవాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి ఒకరు ఈ శిబిరం వద్ద తిష్టవేసి పెట్టుబడి సైతం పెడుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా ఈ జూదక్రీడ సాగుతుంది. సగటున రోజుకు 300నుంచి 400 మంది వచ్చి వెళుతున్నారు. పేకాట ఆడాలన్నా.. పై పందెం కట్టాలన్నా ఎవరైనా సరే 2500 రూపాయలు శిబిరం నిర్వాహకులకు చెల్లించుకోవాలి. అప్పుడే వారిని పడవలో నది దాటించడం, తిరిగి నది ఒడ్డుకు తీసుకురావడం జరుగుతోంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇదీ చదవండి: