దివంగత నేత వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదనే కారణంతో.. ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో రంగా వర్ధంతి జరపాలని గ్రామస్థులు నిర్ణయించారు. దాని కోసం పోలీసులను అనుమతి కోరగా.. వారు అంగీకరించారు. ఈ క్రమంలో నేడు గ్రామంలో రంగా వర్ధంతి కార్యక్రమం జరుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరపడానికి వీల్లేదని చెప్పారు.
దీంతో మనస్తాపం చెందిన శివాది పాపారావు అనే వ్యక్తి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక వైకాపా నేత ప్రోద్బలంతో సీఐ తన తమ్ముడితో దురుసుగా ప్రవర్తించాడని.. అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని బాధితుని సోదరుడు తెలిపారు. తాము కేవలం విందు కార్యక్రమానికే అనుమతి ఇచ్చామనీ.. లౌడ్ స్పీకర్లు పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్లే కార్యాక్రమాన్ని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి.