ETV Bharat / state

మద్యం కోసం... రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్​లోకి!

కరోనా భయం మరిచారు. లాక్ డౌన్ నిబంధనలు వదిలేశారు. రెడ్ జోన్ ప్రాంతాల నుంచి మద్యం కోసం గ్రీన్ జోన్​లోకి వచ్చేశారు. నెలన్నర తర్వాత తెరిచిన మద్యం దుకాణాలకు పరుగులు తీశారు. కిలోమీటర్ల మేర బారులు తీసి నుంచున్నారు. గుంటూరు జిల్లాలో మద్యం కోసం జనం ప్రదర్శించిన ఆరాటమిది.

people comes from green zone to red zone for liquor in guntur district
గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాలు
author img

By

Published : May 4, 2020, 5:10 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రీన్ జోన్​లో ఉంది. అక్కడ మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రెడ్ జోన్ ప్రాంతమైన గుంటూరు నుంచి ప్రత్తిపాడుకు మందు కోసం జనాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.

పొలాల్లో నుంచి అడ్డదారుల్లో రెడ్ జోన్ ప్రాంతం నుంచి గ్రీన్ జోన్​లోకి వస్తున్నారు మందుబాబులు. గుంటూరు జిల్లా కాకుమానులోకి రెడ్ జోన్​లో ఉన్న ప్రకాశం జిల్లా నుంచి మద్యం కోసం తరలివస్తున్నారు. ఈ పరిణామంతో... గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

వీరికి కరోనా భయమేలేదు.. గొంతు తడవడమే ముఖ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.