గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసనగర్, గుండయ్య తోట ప్రాంతాల్లోని రేకుల షెడ్డులో చేసిన తనిఖీల్లో 37.5 క్వింటాళ్ల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన కావూరు సాయిబాబు, ఎర్రంశెట్టి సాంబశివరావులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి... బియ్యం బస్తా మోసిన తహసీల్దార్... ఎందుకంటే..?