ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ మృతి బాధాకరమని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరు రామన్నపేటలో స్వామి అగ్నివేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పర్యావరణ సమస్యలు, బాలల వెట్టిచాకిరిపై పోరాటం, ప్రాంతీయ ఉద్యమాలు తదితర అంశాలపై తనదైన శైలిలో ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవతం చేసిన గొప్ప వ్యక్తి స్వామి అగ్నివేశ్ అని అన్నారు.
సతి యాక్ట్ , బంధు ముక్తి మోర్చా ,బాలల హక్కులు, బేటీ బచావో బేటీ పడావో ఆయన చేసిన ఉద్యమంలో నుంచి పుట్టినవేనని వివరించారు. ఆయన బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారని.. ప్రధానంగా సోంపేట థర్మల్ ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:
శ్రావణి ఆత్మహత్య: బయటపడ్డ ఫోన్ కాల్ రికార్డులు.. దర్యాప్తు ముమ్మరం