Golla Baburao: మంత్రి పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ బహిరంగంగా మాట్లాడిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకే క్యాంపు కార్యాలయానికి పిలిపించారన్న చర్చ జరిగింది. అయితే బాబూరావు సీఎంను కాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. సుమారు రెండు గంటలపాటు ఆయన క్యాంపు కార్యాలయంలోనే ఉన్నా సీఎంను కలవలేదని సమాచారం. గురువారం ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో అక్కడే కలిసే అవకాశం ఉందని తెలిసింది.
ఇదీ చదవండి: రుయాలో ఆంబులెన్స్ మాఫియా.. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన తండ్రి