ETV Bharat / state

సికింద్రాబాద్-విశాఖ ఎక్స్​ప్రెస్​లో హాహాకారాలు.. ఏసీ పనిచేయక ప్రయాణికుల గగ్గోలు - సికింద్రాబాద్ టు విశాఖ స్పెషల్ ఎక్స్​ప్రెస్ నో ఏసీ

Ap Special Express Train Ac Problem: అసలే ఎండాకాం..ఆపై పూర్తిగా కిటికీలు మూసి ఉండే బోగీలు. దానికి తోడు ఏసీలు పనిచేయకపోతే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. రాత్రి నుంచి ఉదయం వరకు ఏసీ పనిచేయకపోవడంతో.. ట్రైన్​లో వృద్దులు,పసిపిల్లలు అల్లాడిపోయారు. ఇవాళ ఉదయం గమ్యస్థానం విశాఖకు ట్రైన్ చేరుకోవడంతో.. బతుకు జీవుడా అంటూ.. ప్రయాణికులు రోడ్డుపై పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

passengers became worried ac not working in train
స్పెషల్ ఎక్స్​ప్రెస్​లో ఏసీ బంద్
author img

By

Published : Apr 2, 2023, 4:53 PM IST

Ap Special Express Train Ac Problem: రైల్వే శాఖ నిర్లక్ష్యం ప్రయాణీకుల సహనానికి పరీక్ష పెడుతోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వచ్చే స్పెషల్ ఎక్స్​ప్రెస్​ రైలు​లో ఏసీలు పనిచేయలేదు. అసలే ఎండాకాలం కావటంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతమయ్యాయి. గాలి ఆడక పసిపిల్లలు, వృద్దులు అల్లాడిపోయారు. విజయవాడ స్టేషన్​లో విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారులు, టెక్నికల్ అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకునివచ్చినా పరిష్కారం మాత్రం లభించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎవరూ తమ సమస్యపై స్పందించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాయంత్రం సికింద్రాబాద్​లో బయలుదేరిన దగ్గర నుంచి ఈ సూపర్ ఫాస్ట్ ఏసీ స్పెషల్ ఎక్స్​ప్రెస్​లో పలు భోగిల్లో ఏసీ పనిచేయక ఉక్కపోతతో ఊపిరి ఆడక నానా అవస్థలకు గురయ్యారు. చంటి పిల్లలతో సైతం డోర్ వద్ద రాత్రంతా కాలక్షేపం చేయాల్సి వచ్చింది. పరిమితంగా స్టాపులు ఉండడం వల్ల ఏసీ భోగిలో సౌకర్యంగా ప్రయాణం చేయాలనుకున్న ప్రయాణికులకు ఎదురైన ఈ చేదు అనుభవంపై మండిపడుతున్నారు. అధికారులకు ఎస్ఎంఎస్, వీడియోలు పంపించటం ద్వారా సమాచారం ఇచ్చినా.. ప్రత్యక్షంగా స్టేషన్​లోని అధికారులుతో చెప్పినా ఫలితం లేకపోవడం వారిని మరింతగా ఆగ్రహాన్ని గురిచేసింది. ఈ రైలు నిన్న రాత్రి సికింద్రాబాద్​లో బయలుదేరి ఉదయం విశాఖ చేరుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఓ ఎక్స్​ప్రెస్​లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సికింద్రాబాద్ నుంచి షాలిమార్​కు వెళ్తున్న ఎక్స్​ప్రెస్​ రైలులో ఏసీ పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సుమారు 8 గంటల నుంచి రైలులో ఏసీ పనిచేయట్లేదని ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు మాత్రం స్పందించపోవటంతో విసుగెత్తిపోయిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విజయనగరం రైల్వేస్టేషన్​లో గంటపాటు రైలును ఆపేసి.. ఇంజన్ కదలకుండా ముందు అడ్డుగా నిలబడి ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రైల్వే అధికారులు దిగొచ్చి రైలులో మరమ్మతులు నిర్వహించి ఏసీని పునరుద్దరించారు. దీంతో గంటన్నర తర్వాత షాలిమర్ ఎక్స్​ప్రెస్ విజయనగరం రైల్వే స్టేషన్​ నుంచి కదిలింది. ప్రయాణికుల సమస్య పరిష్కారం కావటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తమ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవటంపై ప్రయాణికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.