ETV Bharat / state

House arrest: విపక్ష, విద్యార్థి సంఘాల నేతల గృహ నిర్బంధం - opposition leaders House arrest in Guntur district

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని యువజన సంఘాలు నేడు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దాంతో గుంటూరు జిల్లాలో విపక్షాలు యువజన, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముందస్తుగా నేతలను అరెస్టు చేశారు. మరి కొందరిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టారు.

house arrest
నేతల గృహనిర్బంధం
author img

By

Published : Jun 28, 2021, 9:35 AM IST

గుంటూరు జిల్లాలో విపక్షాలు, యువజన, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని యువజన సంఘాలు నేడు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. హోంమంత్రి ఇంటి ముట్టడికి బీజేవైఎం పిలుపునివ్వగా.. ముందస్తుగా నేతలను అరెస్టు చేశారు. మరికొందరిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు కాపలా ఉన్నారు. అలాగే వామపక్ష అనుబంధ సంఘాలు కలెక్టరేట్​ను ముట్టడించాలని భావించగా.. ఆదివారం రాత్రే ఆయా సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వామపక్షాల కార్యాలయాల వద్ద పోలీసులను కాపలాగా పెట్టారు.

తెదేపా యువజన సంఘాల నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకుడు రావిపాటి సాయి కృష్ణకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే అడ్డుకున్నారు. ఉద్యోగాల కోసం ఉదమిస్తున్న యువజన విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టు నోటీసులతో భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు సాధించేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

BC LEADERS: ప్రభుత్వ వైఫల్యాలపై జులై 2న రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.