ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు డీన్ డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 218 కళాశాలల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు నిర్వహించేందుకు అన్ని వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను జూన్ 15 నుంచి 24 వరకు ఏఎన్‌యూలోని కళాశాలల డీన్ కార్యాలయంలో చేపట్టనున్నారు.
కళాశాలల కేటగిరీ, విశ్వవిద్యాలయ ఆమోద పత్రాలు, స్థాపించిన సంవత్సరం, వసతి సదుపాయం, కోర్సులు, మాధ్యమాలు, సిబ్బంది వివరాలు, సౌకర్యాలు, గతేడాది తాలూకు గుర్తింపుపత్రాలను తీసుకురావాలని డాక్టర్ రామిరెడ్డి సూచించారు. ఏవైనా సవరణలుంటే ఈనెల 27లోపు అందజేయాలని డీన్ డాక్టర్ రామిరెడ్డి కోరారు.
ఇదీ చదవండి: ఆర్థిక ఇబ్బందులున్నా పద్దు భారీగానే.. 2.60 లక్షల కోట్లు..!