ETV Bharat / state

'వంద'కు చేరిన ఉల్లి... జనాల లొల్లి - onion price hike in market

బహిరంగ మార్కెట్​లో ఉల్లి ధర కిలో రూ.100కు చేరటంతో.. ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో రూ.25కు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలరోజుల నుంచి ఈ పరిస్థితి ఉన్నా పట్టించుకోకపోవటం దారుణమని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

price hike
'వంద'కు చేరిన ఉల్లి...జనాలు లొల్లి
author img

By

Published : Nov 27, 2019, 3:09 PM IST

'వంద'కు చేరిన ఉల్లి...జనాలు లొల్లి

రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిధరలు ఎన్నడూ లేని విధంగా అమాంతం పెరగడం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారు. బహిరంగ మార్కెట్​లో కిలో రూ.100 ధర పలుకుతుండటంతో ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా రాయితీపై కిలో రూ.25లకే అందిస్తోంది. ఆధార్ నమోదు చేసుకుని... ఒక్కొక్కరికి ఒక కేజీ మాత్రమే ఇస్తున్నారు. ఇవీ నాణ్యత లేనివి ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గంటల తరబడి క్యూలో నిలుచుని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని...దీని వల్ల పనులకు వెళ్లలేకపోతున్నామనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు డ్వాక్రా సంఘాల ద్వారా రైతు బజార్లోనే వేరే రకం ఉల్లి 67 రూపాయిలకు విక్రయిస్తున్నారు. దాదాపు నెలరోజుల నుంచి ఈ పరిస్థితి ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలను బహిరంగ మార్కెట్​లో నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

'ముఖ్యమంత్రికి అవగాహన లేదు.. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.