గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో వారం రోజుల పాటు లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ తహసీల్దార్ నాంచారయ్య ఆదేశాలు జారీ చేశారు. మండలంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10వ తేదీ నుండి 16 వరకు కొల్లిపర, తూములూరు, దావులూరు అడ్డరోడ్డు గ్రామాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
అత్యవసర సర్వీసులు మినహా.. మిగిలిన అన్ని వ్యాపార కార్యకలాపాలు ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. టీ, టిఫిన్ సెంటర్లు, హోటళ్లను వారం రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి: