గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మూడో కరోనా కేసు నమోదైంది. ప్రత్తిపాడులో ఇటీవలే గుంటూరు మార్కెట్లో ముఠా కూలీగా పని చేస్తున్న వ్యక్తికి కరోనా వచ్చింది. ఇప్పుడు ఆయన భార్యకు కూడా కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఇంకా మరి కొంతమంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వట్టిచెరుకూరు మండలంలో ఒక కరోనా కేసుకు సంబంధించి కాంటాక్ట్ ఉన్న వారికి పరీక్షలు చేశారు. వారి ఫలితాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు శుభవార్త