ప్రమాదం.... రహదారి రక్తసిక్తం! - గుంటూరు జిల్లా యడవల్లిలో రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన మేకల గోవిందు, గోళ్ళ రామయ్య, గోరంట్ల అంజయ్య చిలకలూరిపేట నుంచి ద్విచక్ర వాహనం మీద తమ గ్రామానికి వెళుతున్నారు. యడవల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో వారిని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవిందు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అంజయ్య ,రామయ్యను నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు అంతా రక్తంతో తడిసిపోయింది. చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయిBody:చిలకలూరిపేట- కోటప్ప కొండ మార్గంలో శనివారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.. ప్రకాశం జిల్లా సంతమాగులూరు కు చెందిన మేకల గోవిందు(35) గోళ్ళ రామయ్య(40), గోరంట్ల అంజయ్య(60) చిలకలూరిపేట నుంచి ద్విచక్ర వాహనం మీద తమ గ్రామానికి వెళుతున్నారు . .. యడవల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో వారిని వేగంగా ఢీకొట్టింది... ఈ ప్రమాదంలో గోవిందు (35 అక్కడికక్కడే మృతిచెందాడు.. తీవ్రంగా గాయపడిన అంజయ్య ,రామయ్యను నరసరావుపేట లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు ..చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై ఆసన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7