గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
చిలకలూరిపేటకు చెందిన గోపీ, దుర్గారావు, వంశీలు ద్విచక్రవాహనంపై మండల కేంద్రమైన నాదెండ్లకు పని మీద వెళ్లారు. అనంతరం ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై తిరుగు పయనమయ్యారు. గణపవరం హైస్కూల్ సమీపంలో వీరి వాహనం... యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన అబ్దుల్లా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిలకలూరిపేటకి చెందిన గోపీ(30) అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గారావు, వంశీ, అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి