గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి- తాతపూడి మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, మృతుని ఆచూకీ తెలిసినవారు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. మురికిపూడి వీఆర్వో షేక్ మస్తాన్‌వలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై భాస్కర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: