ETV Bharat / state

ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్యాయత్నం - guntur dst crime news

ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ టవర్ ఎక్కి చనిపోతున్నా అని హల్​చల్ చేశాడు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఘటన వివరాలివి..!

oldmen comiited suicide attempt in guntur dst thenali

author img

By

Published : Jun 15, 2020, 11:44 PM IST

కుటుంబ సభ్యులకు దూరమైన ఓ వృద్దుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. తెనాలికి చెందిన సుబ్రహ్మణ్యం అనే 62 ఏళ్ల వృద్ధుడు 12 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాడు. అతని భార్య చెన్నైలోని కుమార్తె వద్ద ఉంటోంది. కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఒంటరితనంతో మనస్తాపానికి గురై చనిపోవాలనుకున్నట్లు వృద్ధుడు తెలిపాడు.

పెట్రోలు సీసాతో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుబ్రహ్మణ్యం కేకలు వేశాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన తెనాలి రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని వృద్ధునితో సంప్రదింపులు జరిపారు. కుటుంబ సభ్యులను పిలిపిస్తామని హామీ ఇచ్చి టవర్ పైనుంచి కిందకు దించారు.

ఇదీ చూడండి..

రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.