ETV Bharat / state

మంచంపై విగతజీవిగా వృద్ధురాలు...మృతికి కారణం హత్యేనా? - old lady death

ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో జరిగింది. పక్కింటి వారు ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకెళ్లి చూడగా... మంచంపై చలనం లేకుండా పడి ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంచం పై విగతజీవిగా వృద్ధురాలు
Old Lady Suspicious death
author img

By

Published : Dec 21, 2020, 2:58 PM IST

విజయలక్ష్మి అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తాడికొండ మండలం పొన్నెకళ్లు గ్రామంలో ఒంటరిగా నివాసముంటున్న ఆమె... ఆదివారం ఇంట్లో నుంచి బయటకు రాలేదు. పక్కింటివారు ఎంత పిలిచినా పలకలేదు. దీంతో చుట్టుపక్కల వారికి అనుమానం రావడంతో ఇంట్లోకెళ్లి చూడగా... వృద్ధురాలు మంచంపై విగతజీవిగా ఉంది. ఆమె మెడ చుట్టూ నల్లటి గీతలు ఉండటంతో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని వారు తాడికొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డబ్బు కోసమేనా...

మృతురాలి భర్త మల్లారెడ్డి ఏడేళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు పిల్లలు కూడా లేకపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ ఘటన జరగడానికి ముందు...తన పేరున ఉన్న ఒక ఎకరా భూమిని రూ.30 ల్లక్షలకు విక్రయించింది. అడ్వాన్సుగా తీసుకున్న నగదు నుంచి రూ. 3లక్షలు బ్యాంకులో ఉన్న ఋణం చెల్లించింది. ఒక రూ.లక్ష పెట్టి తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించింది. అయితే పొలం అమ్మిన్న డబ్బు విషయంపై... తన అన్న కొడుకు లింగారెడ్డితో కొద్దీ రోజుల క్రితం గొడవలు జరిగాయి. తాజాగా వృద్ధురాలు మృతి చెందడంతో... నగదు కోసం అతనే హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: రాజధాని అమరావతిలో ఇద్దరు రైతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.