తెలుగుభాషా సంస్కృతులను కాపాడటం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ సాహితీ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడుకు ఎన్టీఆర్ సాహిత్య పురాస్కారాన్ని అందజేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు.
తమ ప్రభుత్వం ఇంగ్లిష్ కు ప్రాధాన్యత ఇచ్చి తెలుగును విస్మరిస్తోందన్న వాదనల్లో అర్థం లేదని.. అవి కేవలం కల్పిత ప్రచారాలని కొట్టిపారేశారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని దశలలోనూ తెలుగుకు సముచిత స్థానం కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాషకు కీర్తి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని చెప్పారు. పురస్కార గ్రహీత చినవీరభద్రుడు రచించిన పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు.
ఇదీ చూడండి: