సినీ, రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్ సాధించిన ఘనత మరెవరూ సాధించలేదని తెదేపా నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ముగ్గురు తెదేపా ఎంపీలం పోరాడతాం. ఏపీ హక్కుల గురించి నినదిస్తాం. లక్ష్య సాధనలో ఎన్టీఆర్, చంద్రబాబు అందరికీ స్పూర్తి.
-గల్లా జయదేవ్
కార్యకర్తలు తాత్కాలికంగా ఇబ్బందులు పడొచ్చు. అయినా ధైర్యం కోల్పోకుండా పని చేయాలి. ప్రభుత్వం పోయిన సందర్భంలో అందరం బాధలో ఉన్నాం. గెలుపు, ఓటమి సాధారణం. ఓడిపోయామని బాధ పడాల్సిన పని లేదు. మళ్లీ అధికారంలోకి రావటానికి ఏం చేయాలనేది అందరూ ఆలోచించాలి. కార్యకర్తలు ఇబ్బంది పడితే పార్టీ వారికి అండగా ఉంటుంది.
-యనమల
సినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. ఈ ఎన్నికల్లో తెదేపా ఓటమి అసహజం. ఎన్నికల్లో జరిగింది ఓటింగ్ కాదు... ఇంకేదో జరిగిందనేది అందరి అనుమానం. మళ్లీ రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాలి. అందుకు అందరం కలిసి పని చేద్దాం.
-కోడెల శివప్రసాద్
ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిద్దాం. చంద్రబాబు స్ఫూర్తితో ముందుకు సాగుదాం. రామన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొద్దాం.
-కాల్వ శ్రీనివాసులు
మళ్ళీ తెదేపా అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నా. ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవు. ఏదో జరిగిందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని కోరుతున్నా. ప్రజలకు ఏం కావాలో అన్నీ చేశాము. సాంకేతికంగా జరిగిన నష్టాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్దాం.
-మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కార్యకర్తలకు అవకాశం...
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పార్టీ కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా... పరాజయంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేకున్నా ఓడామని అభిప్రాయపడ్ట కార్యకర్తలు... వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ...